WWDC 2022 ఈవెంట్లో ఐవోఎస్ 16, వాచ్ఓఎస్ 9లు లాంచ్ అయ్యాయి.


వాచ్ఓఎస్ 9 ద్వారా యాపిల్ వాచ్ యూజర్లు హెల్త్, ఫిట్‌నెస్‌ను మరింత మెరుగ్గా ట్రాక్ చేయవచ్చు.


యాపిల్ వాచ్ఓఎస్ 9 ద్వారా మెడికేషన్స్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది.


యాపిల్ డెవలపర్ ప్రోగ్రాంలో భాగమైన వారికి వాచ్ ఓఎస్ 9 అప్‌డేట్ మొదట రానుంది.


యాపిల్ వాచ్ సిరీస్ 4 లేదా ఆ తర్వాతి వెర్షన్ వాచ్‌లు ఉపయోగించేవారు ఈ అప్‌డేట్‌ను అందుకోనున్నారు.


వాచ్ ఓఎస్ 9 ద్వారా వినియోగదారులు తమ హెల్త్ రిపోర్టును పీడీఎఫ్ ద్వారా కూడా పొందవచ్చు.


ఐఫోన్ 8 లేదా ఆ తర్వాత వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారికి ఐఓఎస్ 16 అందుబాటులోకి రానుంది.


ఈ ఆపరేటింగ్ సిస్టం డెవలపర్ ప్రివ్యూ ఈ వారంలో విడుదల కానుంది. పబ్లిక్ బీటాను వచ్చే నెలలో తీసుకురానున్నారు.


ఇందులో యాపిల్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.


మెసేజెస్‌కు అతిపెద్ద అప్‌డేట్‌ను ఐవోఎస్ 16లో అందించారు. ఈ అప్‌డేట్ ద్వారా మెసేజెస్‌ను ఎడిట్ చేయవచ్చు.
(All Images Credit: Apple)