డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారు తప్పకుండా తమ షుగర్ లెవెల్స్ మీద దృష్టి నిలపాలి.

ముఖ్యంగా పండ్లు తీసుకునే సమయంలో ఏ పండు తింటే షుగర్ స్థాయి పెరగదో చూసుకోవాలి.

ఇది ఆపిల్, ఆరెంజ్ రెండు పండ్లు విరివిగా దొరికే సీజన్ కనుక ఈ రెండింటిలో ఏది ఎంచుకోవడం మంచిది?

ఆపిల్ లో ఫైబర్ ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ అకస్మాత్తుగా పెంచదు. కడుపు నిండుగా ఉన్నభావన కలుగుతుంది.

ఆపిల్ లో ఉండే పాలీఫెనాల్స్ ఇన్సులిన్ ఉత్పత్తికి అవసరమయ్యే బీటా కణాల జీవిత కాలాన్ని పెంచుతాయి.

ఆపిల్ ను సలాడ్ లా కొద్దిగా గింజలు, చీజ్ ముక్కవంటివి కలిపి తీసుకుంటే మంచిది.

ఒక మోతాదు సైజున్న పండు నుంచి దాదాపు 4 గ్రాముల ఫైబర్ అందుతుంది, 8.37 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది.

దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 36. గ్లైసిమిక్ లోడ్ . చక్కెర చాలా తక్కువ అని చెప్పుకోవాలి.

ఆరెంజ్ సిట్రస్ ఫ్లేవర్ తో షుగర్ పేషెంట్లకు అనుకూలమైన పండు. ఫైబర్, విటమిన్ సి ఉంటాయి.

ఆరెంజ్ గ్లైసిమిక్ ఇండెక్స్ 31-50 మధ్య ఉంటుంది. ఒక మీడియం సైజు ఆరెంజ్ తో రోజుకు అవసరమయ్యే విటమిన్ సి లభిస్తుంది.

వీటిలో ఫోలెట్, పొటాషియం కూడా అదనంగా ఉంటాయి.

ఏ పండైనా సరే స్నాక్ గా తీసుకోవడం మంచిది. రాత్రి నిద్రకు ముందు పండ్లు తినకూడదు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels