అపోలో ఫిష్ ఫ్రై ఇలా చేస్తే రుచి అదిరిపోవాల్సిందే!

నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేప‌లను ఎంతో ఇష్టంగా తింటారు.

చేప‌ల‌ను వేపుడు లేదంటే పులుసు చేసుకుని తింటారు.

అపోలో ఫిష్‌ తో చేసే ఫ్రై మరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు.

ఒక పాత్ర‌లో అపోలో ఫిష్ ముక్క‌ల‌ను తీసుకుని ఉప్పు, అల్లం, కారం, ప‌సుపు, నిమ్మ‌ర‌సం వేసి కలపాలి.

ఆ తర్వాత అందులో కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్‌, మైదా పిండి వేసి బాగా క‌ల‌పాలి.

అనంతరం చేప ముక్క‌ల‌ను సన్నని మంట‌ మీద ఫ్రై చేసుకుని పక్కన పెట్టాలి.

ఆ తర్వాత ఓ పాన్ లో నూనె వేసి అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి.

దానికి క‌రివేపాకు, ధ‌నియాల పొడి, ఉప్పు, సోయా సాస్‌, మిరియాల పొడి, కొత్తిమీర ఆకులు వేసి వేయించాలి.

ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్క‌ల‌ను వేసి బాగా ఫ్రై చేయాలి.

అనంతరం ఫిష్ ముక్క‌ల‌ మీద నిమ్మ‌ర‌సం పిండితే రుచిక‌ర‌మైన అపోలో ఫిష్ డిష్ రెడీ అవుతుంది.

All Photos Credit: Pixabay.com