ఏపీలో 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు 01.07.2022 కి ఇంటర్ ఉత్తీర్ణులై, డిగ్రీ చదువుతూ ఉండాలి కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు టెన్త్ పాసై, ఇంటర్ ఎగ్జామ్స్‌కు అప్లై చేసి ఉండాలి కానిస్టేబుల్ పోస్టుకు జూలై 1, 2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల వారు అర్హులు SI పోస్టుకు 01.07.2022 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వారు అర్హులు