యాంటీ బయోటిక్స్ ఇలా వాడితే ప్రమాదమే ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్, మలేరియా వంటి రోగాల కన్నా యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడి మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రపంచ దేశాల్లో యాంటీబయోటిక్స్‌ను అధికంగా వాడుతున్న దేశాల్లో మనదే మొదటి స్థానం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దుకాణాల్లో యాంటీబయోటిక్స్ ను అడ్డదిడ్డంగా మనదేశంలో అమ్ముతున్నారు. శక్తివంతమైన యాంటీ బయోటిక్ మందులను ఎక్కువ కాలం వాడితే కాలేయం, కిడ్నీ వంటి అవయవాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. శక్తి వంతమైన యాంటీ బయోటిక్స్ తరచూ వాడితే శరీరం చాలా నీరసపడిపోతుంది. యాంటీ బయోటిక్స్‌ను అధికంగా వాడడం వల్ల బ్యాక్టిరియాలు సూపర్ బగ్స్‌గా మారతాయి. వాటిని తట్టుకోవాలంటే మరింత శక్తివంతమైన యాంటీ బయోటిక్స్ వాడాల్సి వస్తుంది. ఇలా శక్తివంతమైన యాంటీ బయోటిక్స్ వాడడం వల్ల శరీరానికి ఎంతో నష్టం కలుగుతుంది.