సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా దర్శకురాలు నందినీ రెడ్డి తీసిన 'అన్నీ మంచి శకునములే' ఎలా ఉంది? మినీ రివ్యూ చూడండి!

కథ : రిషి (సంతోష్ శోభన్), ఆర్య (మాళవికా నాయర్) ఒకే రోజు, ఒకే ఆస్పత్రిలో పుడతారు. ఒకరి ఇంట్లో మరొకరు పెరుగుతారు.

నిజానికి ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కూతురు ఆర్య. కానీ, తనకు కొడుకు పుట్టాడని రిషిని పెంచుకుంటాడు. 

రిషి ఒరిజినల్ తండ్రి దివాకర్ (నరేష్) ఇంట్లో ఆయన కుమార్తెగా ఆర్య పెరుగుతుంది . పేరెంట్స్ & పిల్లలకు నిజం తెలిసిందా?

రిషి, ఆర్య జన్మించక ముందు నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయ్యింది? ప్రేమ ఏమైంది? అనేది కథ. 

ఎలా ఉంది? : రెగ్యులర్, రొటీన్, సేమ్ ఓల్డ్ ఫార్ములా సీన్లతో తీసిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. 

సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తే... మధ్య కొన్ని కామెడీ సీన్లు, క్లైమాక్స్ మినహా 'వావ్' ఫ్యాక్టర్స్ ఏమీ లేవు.

మిక్కీ జె మేయర్ సంగీతంలో గుర్తుంచుకునే పాటలు లేవు. నేపథ్య సంగీతం కొంత బెటర్!

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జోడీ బావుంది. ఇద్దరూ బాగా చేశారు. మిగతా భారీ తారాగణం పరిధి మేరకు చేశారు.

క్యారెక్టరైజేషన్స్ విషయంలో నందినీ రెడ్డి చాలా వర్క్ చేశారు. కొత్త కాన్సెప్ట్ లేదా కథపై ఆ వర్క్ చేస్తే బావుండేది. 

క్లైమాక్స్, మాళవికా నాయర్ నటన కోసం చూడాలని అనుకుంటే థియేటర్లకు వెళ్ళండి. లేదంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి.