తెలుగుమ్మాయి అంజలీ ‘వకీల్‌సాబ్’ తర్వాత కొద్ది రోజులు కనిపించలేదు. తాజాగా అంజలి ‘మాచర్ల నియోజకర్గం’లో నిఖిల్‌తో స్టెప్పులేశారు. ‘రాను రానంటూ’ పాటలో దుమ్ముదులిపారు. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా మొత్తానికి ఆ పాటే హైలెట్. అంజలి ఇప్పుడు స్లిమ్‌గా మారి మరింత క్యూట్‌గా మురిసిపోతున్నారు.. ప్రస్తుతం మలయాళ చిత్రం ‘నయాట్టు’ తెలుగు రీమేక్‌లో అంజలి నటిస్తున్నారు. తెలుగు వెబ్ సీరిస్ ‘ఝాన్సీ’, కన్నడంలో ‘బైరాగీ’ సినిమాలోనూ నటిస్తున్నారు. అంజలి తాజాగా చీరలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చతెనుగు పడుచు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అని ఫ్యాన్స్ అంటున్నారు. Images and Video Credit: Anjali/Instagram