టాలీవుడ్ హీరోయిన్లలో ఇతర భాషలకు చెందిన అమ్మాయిలు ఎక్కువ. అయితే... కొందరు తెలుగమ్మాయిలూ ఉన్నారు. తెలుగులో మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.
ఈషా రెబ్బాది కూడా వరంగలే. ప్రస్తుతం మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'ఆయిరమ్ జన్మంగళ్' సినిమాలు చేస్తున్నారు.
అంజలి... ఈ రాజోలు అమ్మాయి తమిళంలో 'జర్నీ', ఇంకా పలు హిట్ సినిమాలు చేశారు. మలయాళంలో నివిన్ పౌలికి జంటగా నటించారు.
'రమణ్ రాఘవ్ 2.0'తో హిందీకి పరిచయమైన శోభితా ధూళిపాళ్లను చూస్తే ఎవరైనా ఉత్తరాది అమ్మాయి అనుకుంటారు. కానీ, ఆమెది తెనాలి. తెలుగులో 'గూఢచారి' వంటి హిట్ సినిమా కూడా చేశారు.
'బస్ స్టాప్'లో నాయికగా నటించిన తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా తమిళంలో కథానాయికగా అరడజనుకు పైగా సినిమాలు చేశారు.
మెగాస్టార్ 'జై చిరంజీవా', యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నరసింహుడు' సినిమాల్లో నాయికగా నటించిన సమీరా రెడ్డి... హిందీ సినిమాలే ఎక్కువ చేశారు.
హిందీ సినిమా 'వీరే ది వెడ్డింగ్', వెబ్ సిరీస్ 'రసభరి' చేసిన స్వరా భాస్కర్ తెలుగమ్మాయే. ఆమె తండ్రి తెలుగువారు.
'చల్ మోహన్ రంగా', 'లై' సినిమాల్లో నాయిక మేఘా ఆకాష్ కూడా తెలుగుమ్మాయే. ఆమె తండ్రి తెలుగువారే. మేఘ తమిళ సినిమాలూ చేస్తున్నారు.
లక్ష్మీ మంచు ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్ 'మానిస్టర్', తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
'ఈ రోజుల్లో'తో తెలుగు తెరకు పరిచయమైన వరంగల్ అమ్మాయి ఆనంది. తమిళంలో కథానాయికగా హిట్ సినిమాలు చేశారు.
'కలర్స్' షోతో కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతిరెడ్డి... తమిళ అనువాదం 'సుబ్రమణ్యపురం'తో నాయికగా హిట్ అందుకున్నారు.
'శంభో శివ శంభో'లో రవితేజకు చెల్లెలుగా నటించిన అభినయ తెలుగమ్మాయే. తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తున్నారు.