రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మొదటి వీకెండ్‌లో యానిమల్ ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది.

మొదటి మూడు రోజుల్లో ‘యానిమల్’ హిందీ వెర్షన్ రూ.176.58 కోట్ల నెట్ వసూలు చేసింది.

‘జవాన్’ మొదటి మూడు రోజుల్లో రూ.180.45 కోట్లు సాధించింది.

‘జవాన్’ హిందీ వెర్షన్ లైఫ్‌టైమ్ రూ.570 కోట్లకు పైగా నెట్ సాధించింది.

‘యానిమల్’ ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సోమవారం కూడా ‘యానిమల్’ హిందీ వెర్షన్ రూ.35 కోట్ల నుంచి రూ.36 కోట్ల వసూలు చేసిందని అంచనా.

స్పీడ్ ఇలానే కొనసాగితే ‘జవాన్’ రికార్డును ‘యానిమల్’ బద్దలు కొట్టే అవకాశం ఉంది.