ఏపీ అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

మంగళగిరిలో గెలిచి నారా లోకేశ్ తన సత్తా చాటుకున్నారు. తన తల్లికి ముద్దు పెట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నారా లోకేశ్ తన భార్య బ్రహ్మాణి, కుమారుడు దేవాన్ష్​తో కలిసి తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినా.. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు.

నారా భువనేశ్వరితో పాటు.. బాలయ్య వైఫ్ వసుంధరా దేవి కూడా ఈ సెలబ్రేషన్స్​లో పాల్గొన్నారు.

నారా లోకేశ యువగళం అనే పేరుతో చేసిన యాత్ర తెలుగుదేశం పార్టీకి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.

కూటమి పేరుతో జనసేన, భాజపాతో పొత్తు పెట్టుకుని.. ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించింది.

ఈ సందర్భంగా.. నారా ఫ్యామిలీ చేసుకున్న సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూటమి శ్రేణులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తమ అభిమాన నాయకులకు విషెష్ చెప్తున్నారు.

74 ఏళ్ల వయసులో కూడా టీడీపీని గెలిపించేందుకు చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు.

Thanks for Reading. UP NEXT

ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే

View next story