చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్టే, అనకొండ నోట్లో తలపెట్టినట్టే: జగన్



‘అరుంధతిలో పశుపతిలా అధికారం కోసం పసుపు పతి లేచి వదల బొమ్మాళీ వదల అంటూ వస్తున్నాడు’



‘మీ బిడ్డ ఒక్కడు.. నక్కలు, తోడేళ్లు అనేక మంది. జరగబోయేది కురుక్షేత్రం.. మీరు సిద్ధమేనా?’



‘ఈ ఎన్నికలు MLA,MPలను ఎన్నుకునేవి కావు, ఐదేళ్లు మీ భవిష్యత్‌ను, పథకాలను నిర్ణయించేవి’



‘ప్యాకేజీ స్టార్‌కు ఆంధ్రా అంటే చులకన. ఎంతంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ పోయేంత..’



‘వాలంటీర్లు ఇంటికి రావాలన్నా, పథకాలు, ఇంగ్లీష్‌ బడులు కొనసాగాలన్నా మీ బిడ్డ పాలన కొనసాగాలి’



‘ప్రజలకు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు, నా కోసం 2 బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కండి’



‘రెండు బటన్లు నొక్కితే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?’



‘ప్రజలకు మంచి చేసే ఫ్యాన్ ఇంట్లో, చెడు చేసే సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్‌ సింకులో..’



‘తుప్పు పట్టిన సైకిల్‌ రిపేర్ చేయించేందుకు చంద్రబాబు అవస్థలు పడుతున్నారు’



‘మీ బిడ్డ ఒక్కడే ఓవైపున్నాడు, ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరే’



‘అక్కాచెల్లెలను, అవ్వాతాతలను, రైతన్నలను మోసం చేయడానికి తెచ్చిన మేనిఫోస్టోను చెత్తబుట్టలో వేస్తారు’



‘కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? అక్కా.. ఓ అవ్వా.. ఓ అన్నా.. నమ్ముతారా’