నిద్రపోతున్న పులితో శ్రీముఖి ఆటలు, థాయ్‌లాండ్‌లో రాములమ్మ సాహసాలు

శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది. ఎనర్జీ కుప్పలు తెప్పలుగా ఉంటుంది.

అలాంటి శ్రీముఖి హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఎంత ఉత్సాహంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం శ్రీముఖి తన ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా ఆమె పులితో ఆటలాడుతూ కనిపించింది.

దీంతో ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి రాములమ్మ అంటున్నారు.

అయితే, శ్రీముఖి తాకిన ఆ పులి చాలా ప్రత్యేకమైనది. ఆ పులి మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది.

అందుకే, థాయ్ వెళ్లిన ప్రతి ఒక్కరు ఆ పులితో సెల్ఫీలు దిగుతూ ధైర్యవంతుల్లా బిల్డప్ ఇస్తుంటారు.

టీవీ షోస్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి చిన్న బ్రేక్ తీసుకుని ఇలా హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది.

Images and Videos Credit: Sreemukhi/Instagram