‘రాఖీ’ చిత్రంలో ఎన్టీఆర్ చెల్లిగా నటించింది యాంకర్ మంజుష. మంజుష సోషల్ మీడియాలో ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. చక్కని ఫొటోలతో ఫాలోవర్లను కూడా పెంచుకుంది. ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. ఆ దుస్తులకే అందం వస్తుంది. మంజుష సెలబ్రిటీ యాంకర్. అందుకే, బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. సినిమా ప్రమోషన్స్‌తో మంజుష బిజీగా బిజీగా గడిపేస్తోంది. తాజాగా మంజుష పులి డిజైన్ టాప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్లు కాకినాడ పులి ఇక్కడుందేమిటని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మంజుష ఫొటోలు చూసి ఆమె ఫాలోవర్లు ఫిదా అవుతున్నారు. మరికొందరు.. ‘మేడం సార్.. మేడం అంతే’ అంటున్నారు. Photos Credit: Anchor Manjusha/Facebook