యాంకర్ అనసూయ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’, ‘ఖిలాడి’ వంటి భారీ ప్రాజెక్టులతోపాటు చిన్న సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే, ఈ విషయంలో అనసూయ కాస్త తడబడుతోందేమో అనిపిస్తోంది. వచ్చిన అవకాశాలను వదలకూడదనే ఉద్దేశంతో చిన్న చిత్రాలకు కూడా సైన్ చేస్తోంది. తాజాగా అనసూయ నటించిన ‘దర్జా’ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ, అనుకున్నంతగా ఆ చిత్రానికి టాక్ రాలేదు. దీంతో అనూకు ఫ్లాప్ తప్పలేదు. త్వరలో ‘వాంటెడ్ పండుగాడు’ సినిమా కూడా విడుదల కానుంది. ‘వాంటెడ్ పండుగాడు’లో అనసూయ గ్లామర్ షోతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. కె.రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ చిత్రంలో అనసూయ పుచ్చకాయతో ప్రత్యక్షమైంది. దీంతో పుచ్చకాయ కాన్సెప్ట్ రాఘవేంద్రరావుదే కావచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తాజాగా అనసూయ గొడుగును కత్తిలా తిప్పుతున్న వీడియోను పోస్ట్ చేసింది. Images and Videos Credit: Anasuya Bharadwaj/Instagram