ఇండోనేషియాలోని న్యూ గినియా దీవుల్లో నరమాంసాన్ని తినే ఆదివాసీ తెగ ప్రజలు జీవిస్తున్నారు. సుమారు 25,000 చ.కి.మీ విస్తరించి ఉన్న లోతట్టు చిత్తడి ప్రాంతాలలో ఈ తెగ నివసిస్తోంది. ఆచారాల పేరుతో నరమాంసాన్ని తినే ఈ తెగను అస్మత్(Asmat) అని పిలుస్తారు. ఈ తెగకు చెందిన దాదాపు 65,000 మంది జనాలు ఆయా దీవుల్లో జీవిస్తున్నారు. శత్రువులు కనిపిస్తే.. వారికి పండగే. వారిని చంపేసి.. శవాలను ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వారి తలలను తింటారు. పుర్రె(కపాలం)ను సగానికి కోసి గిన్నెలుగా ఉపయోగిస్తారు. తల చర్మాన్ని చెక్కి మంటపై కాల్చుతారు. ఆ తర్వాత అందరితో కలిసి వాటిని తింటగారు. దవడ ఎముకలు, వెన్నెముక తదితర భాగాలను ఆభరణాలుగా చేసుకుని ధరిస్తారు. వీరి దృష్టిలో మనిషి అంటే ఒక చెట్టు. మనిషి తల ఒక పండు. అందుకే, శత్రువులను చంపిన వెంటనే వారు చెట్టు నుంచి ‘పండు’ను తెంపినట్లుగా తలను నరికి తినేస్తారు. అలా తింటే మరణించిన వ్యక్తి శక్తులు, నైపుణ్యాలు తమకు బదిలీ అవుతాయనేది వారి నమ్మకం. Images & Video Credit: Pexels