హీరోయిన్ అనన్య నాగళ్ల కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంది. వరంగల్ రామప్ప ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు చేసింది. అనంతరం స్వామి వారిని దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీసుకుంది. ఆలయ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేసింది. కార్తీక పౌర్ణమి పూజలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అనన్య సాఫ్ట్ వేర్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. టెక్కీగా జాబ్ చేస్తున్న సమయంలోనే ‘మల్లేశం’ సినిమాలో అవకాశం వచ్చింది. చేనేత కార్మికుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకుంది. ‘వకీల్ సాబ్’, ‘ప్లే బ్యాక్’, ‘మాస్ట్రో’ మూవీల్లో నటించిన అనన్య.. ప్రస్తుతం ’శాకుంతలం’లో నటిస్తోంది. Photos & Video Credit: Ananya Nagalla/Instgram/twitter