అమెజాన్ తన ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలను మరోసారి పెంచింది. అయితే ఎప్పటిలాగా కొంచెం కాకుండా ఈసారి వినియోగదారులను భారీగా బాదేసింది. అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర గతంలో రూ.179గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.299కు పెంచారు. త్రైమాసిక (మూడు నెలల) ప్లాన్ ధర ఇంతకుముందు రూ.459గా ఉంది. ఇప్పుడు దీని ధర రూ.599కు పెరిగింది. అయితే వార్షిక ప్లాన్ల ధరల్లో మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి మార్పూ లేదు. అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.999గా ఉంది. అమెజాన్ ప్రైమ్ సాధారణ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,499గానే ఉంది. 2021 డిసెంబర్ తర్వాత అమెజాన్ ప్రైమ్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి.