హెన్నా జుట్టుకి చాలా మేలు చేస్తుంది. సహజమైన హెయిర్ డైగా ఎన్నో శతాబ్ధాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు.



జుట్టుకి రసాయన రహిత ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది



జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా మార్చేందుకు సహకరిస్తుంది.



హెన్నా పెట్టుకోవడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.



జుట్టును మృదువుగా చేస్తుంది. నిగనిగలాడే మెరుపుని అందిస్తుంది.



జుట్టులో తేమని లాక్ చేస్తుంది. వెంట్రుకలు హైడ్రేట్ గా ఉండేలా సహాయపడుతుంది.



ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి.



హెన్నాలోని శీతలీకరణ గుణాలు స్కాల్ఫ్ చల్లదనాన్ని ఇస్తాయి. చికాకు, దురద, మంటని తగ్గిస్తాయి.



హెన్నా వల్ల జుట్టు మందంగా మారుతుంది.



జుట్టుకి బలమైన పోషణని అందిస్తుంది. పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది.