ఉల్లిపాయ తొక్కలు తీసి డస్ట్ బిన్ లో వేసేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకున్నారంటే వాటిని అసలు పడేయరు.



ఉల్లిపాయ మాదిరిగానే వాటి తొక్కలు కూడా పోషకాలు కలిగి ఉన్నాయి
వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలు పొందుతారు.


ఉల్లిపాయ తొక్కల్ని ప్రత్యేకమైన సువాసన కలిగిన ఉల్లిపాయ ఇన్ఫ్యూజ్డ్ వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.



వెనిగర్ ఉన్న బాటిల్ లో ఉల్లిపాయ తొక్కలు వేసేసి గట్టిగా మూత పెట్టేయాలి.
కొన్ని వారాల పాటు దాన్ని కదిలించకుండా అలాగే ఉంచండి.


ఈ వెనిగర్ ని సలాడ్ డ్రెస్సింగ్, మెరినేడ్ లో ఉపయోగించుకోవచ్చు.



ఉల్లిపాయ తొక్కలోని సపోనిన్ కంటెంట్ ఉంటుంది.
దీన్ని చూర్ణం చేసి నీటితో కలిపినప్పుడు అది కొద్దిగా సబ్బుగా మారుతుంది.


ఈ మిశ్రమంతో పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు. సహజంగా శుభ్రపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి.



ఉల్లిపాయ తొక్క టీ సంప్రదాయ వైద్యంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వారు.



ఇన్ఫెక్షన్స్, ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ టీ నరాలకు విశ్రాంతినిస్తుంది.


ఉల్లిపాయ తొక్కల కషాయాలని హెయిర్ రిన్స్ గా ఉపయోగిస్తారు.
ఈ తొక్కలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.