జుట్టు ఒత్తుగా పెరగడంలో కలబంద బహుముఖ ప్రయోజనాలు అందిస్తుంది. ఇది జుట్టుకి కేరాటిన్ మాదిరిగా పని చేస్తుంది. జుట్టుకి పోషణ ఇస్తుంది. చుండ్రు సమస్యలు దూరం చేస్తుంది. జుట్టు రాలడం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కలబంద, ఆముదం కలిపి జుట్టుకి పట్టిస్తే మెరుపు సంతరించుకుంటుంది. గుడ్డు పచ్చసొనతో కలబంద జెల్ కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టుకి మంచి కండిషనింగ్ పని చేస్తుంది. అలోవెరా, మెంతులు కలిపి తలకి పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కలబంద, ఉల్లిపాయ రసం, నిమ్మరసం వేసి జుట్టుకి పట్టించాలి. దీంతో మసాజ్ చేసుకుంటే జుట్టు కుదుళ్లు గట్టిగా మారతాయి. అలోవెరా జెల్ జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ చేస్తుంది. దీన్ని వాడడం వల్ల జుట్టు నలుపుగా, మెరుపుని ఇస్తుంది. అలోవెరా జెల్ మాడుకు పట్టించడం ద్వారా దురద తగ్గుతుంది. జుట్టుకు కావాల్సిన తేమను అందించడంలో కలబంద జెల్ ముందుంటుంది. కలబంద గుజ్జులో ప్రోటీలిటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మాడుపై దెబ్బతిన్న కణాలను నయం చేస్తాయి.