కొన్ని పండ్లు కూరగాయల తొక్క కింద చాలా సుగుణాలు దాగి ఉంటాయి. కనుక వాటిని అలాగే తినెయ్యాలి

ఆలు పొట్టులో ఫైబర్, విటమిన్ B, ఐరన్ పుష్కలం, వేయించినా ఉడికించినా పొట్టు మాత్రం తియ్యకూడదు

కీరాదోస పొట్టులోని ఫైబర్ జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. ఆర్గానిక్ ఎంచుకుంటే మంచిది

ఆపిల్ తొక్కలో చాలా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మంచిది.

క్యారెట్ తొక్కలో బీటాకెరాటిన్ ఉంటుంది. వీటిని స్క్రబ్బర్ వాడి శుభ్రం చేసి వాడితే మంచిది

వంకాయ తొక్కలో నాసునిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరం.

స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ ఏ బెర్రీ ఫ్రూట్ అయినా సరే వాటి తొక్కల్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం.

చిలగడ దుంప పొట్టులో ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్ తో పుష్కలం. ఉడికించినా, వేయించినా సరే తొక్కతోనే తినండి.

Representational image:Pexels