'టీ'తో అస్సలు తినకూడదని స్నాక్స్ ఇవి



బిస్కెట్స్, పకోడీ, సమోసా, చిప్స్ ఇలాంటివి తింటూ టీ తాగితే ఆహా..చాలా బావుంటుంది



కానీ టీ తో పాటూ కలపి తినకూడని ఆహారపదార్థాలున్నాయి..అవేంటంటే...



కారంగా ఉన్నవి, ఘాటైన ఆహారాలు తింటూ టీ తాగకూడదు. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయ, వేడి వేడి సాస్, కూర, మిరపకాయ వంటి వాటితో కలిపి టీ తీసుకోకూడదు.



సిట్రస్ పండ్లు వంటి ఆమ్లత్వం అధికంగా ఉండే ఆహారాలు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే టీ తాగే సమయంలో పుల్లటి పదార్థాలు తినకూడదు



పాలు పోసి కాచిన టీ తాగొచ్చు కానీ పాల ఉత్పత్తులు టీతో పాటూ తినకూడదా అంటే తినకూడదు. చాలా మంది టీలో క్రీమ్ వేసుకుని ఆ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు



కేకులు, బిస్కెట్లు, చాక్లెట్ లాంటి తీపి ఆహారాలు తీసుకుంటూ చాలా మంది టీ తాగుతారు. ఇది కూడా అనారోగ్యమే



వేయించిన, జిడ్డు కలిగిన ఆహారాలు తీసుకుంటే బరువుగా అనిపిస్తాయి. ఇవి జీర్ణం కావడం కష్టం. పల్లీ పట్టి వంటివి జిడ్డు కలిగిన ఆహారాలు టీతో పాటు తీసుకోకూడదు. దాని వల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది.



టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది కానీ భారీ ఆహారాలతో జత చేయడం వల్ల ఈ ప్రయోజనం పొందలేకపోవచ్చు.



సాధారణంగా తేలికైన, రుచికరమైన స్నాక్స్ టీతో పాటూ తినేందుకు ఎంచుకోవడం ఉత్తమం



Image Credit: Pixabay