నాని నటించిన ‘హాయ్ నాన్న’పై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమా తన హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.

ఇటువంటి స్క్రిప్టు ఎంచుకున్నందుకు నానిపై గౌరవం పెరిగిందన్నారు.

మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉందని పేర్కొన్నారు.

బేబీ కియారా క్యూట్‌నెస్‌తో తన గుండె కరిగిపోయిందని తెలిపారు.

దర్శకుడు శౌర్యువ్‌పై కూడా పొగడ్తల వర్షం కురిపించారు.

‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల మార్కును దాటింది.

త్వరలో అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.

ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నారు.