బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఆలియా భట్ కెరీర్ టాప్ ఫాంలో సాగిపోతుంది. ‘గంగుబాయి కతియావాడీ’, ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్’లతో బాలీవుడ్‌లో సూపర్ హిట్లు లభించాయి. తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ లభించింది. ‘డార్లింగ్స్’తో ఓటీటీ హిట్ కూడా కొట్టారు. ఈ సంవత్సరం కూడా ‘రాకీ అవుర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో బ్లాక్‌బస్టర్ సాధించారు. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’తో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ‘గంగుబాయి కతియావాడీ’ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ‘జిగ్రా’ అనే సినిమాలో ఆలియా నటిస్తున్నారు.