'ఆర్ఆర్ఆర్'తో తెలుగు తెరకు ఆలియా భట్ పరిచయం అయ్యారు. హిందీ చిత్రాలతో ఆవిడ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. 

సీతగా మృణాల్ ఠాకూర్ నటనను ఎవరూ మరువలేరు. తెలుగులో ఆమెకు 'సీతా రామం' తొలి సినిమా. 

డబ్బింగ్ సినిమా 'రాజా రాణి'తో హిట్ కొట్టిన నాజ్రియ, 'అంటే సుందరానికి' చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు. 

విజయ్ దేవరకొండ 'లైగర్'తో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగుకు వచ్చారు. 

హిందీలో రెండు సినిమాలు చేసిన షిర్లే సేతియాకు 'కృష్ణ వ్రింద విహారి' తొలి తెలుగు సినిమా. 

మలయాళ భామ రజిషా విజయన్ 'రామారావు ఆన్ డ్యూటీ'తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 

'భీమ్లా నాయక్'లో రానా, 'బింబిసార'లో కళ్యాణ్ రామ్ జోడీగా నటించిన సంయుక్తా మీనన్ ఈ ఏడాది తెలుగుకు వచ్చారు. 

అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్యా లక్ష్మికి 'గాడ్సే' తొలి తెలుగు సినిమా. 

విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా'తో మిథిలా పాల్కర్ కథానాయికగా పరిచయమయ్యారు.

'ఓరి దేవుడా'లో నటించిన ఆశా భట్‌కూ అదే తొలి తెలుగు సినిమా. వీళ్ళతో పాటు మరి కొందరు ఉన్నారు.