అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మోడ్రన్ అమ్మాయి. ఎప్పుడూ స్టైలుగా రెడీ అవుతారు. 'మిలీ' మూవీ ప్రమోషన్లలో 'పద్ధతిగా రెడీ అవ్వవచ్చు కదా?' అని కొందరు ఆమెను ప్రశ్నించారు. 'నేను ఇలా ఉంటే ఇన్‌స్టాలో యాడ్స్ వస్తాయి. ఈఎంఐలు కట్టుకోవచ్చు' అని జాన్వీ సమాధానం ఇచ్చారు. తనకు అప్పులు, ఈఎంఐలు ఉన్నాయని చెప్పిన జాన్వీ కపూర్ లేటెస్ట్ డ్రస్ రేట్ ఎంతో తెలుసా? హిందీలో ఓ ఇంటర్వ్యూ కోసం అటెండ్ అయిన జాన్వీ కపూర్, ఈ డ్రస్ లో సందడి చేశారు. ఈ డ్రస్ కాస్ట్ ఎంతో తెలుసా? మూడు లక్షలకు పై మాటే! నార్మల్ గా కనిపించే ఈ డ్రస్ అంత రేటా? అని ప్రేక్షకులు నోరెళ్ళ బెడుతున్నారు. ఈ ఏడాది జాన్వీ కపూర్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి... 'గుడ్ లుక్ జెర్రీ', ఇంకొకటి... 'మిలీ'. రెండిటిలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. జాన్వీ కపూర్ (All Images Courtesy : janhvi kapoor instagram)