అదితి రావు హైదరి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రస్తుతం సెలెక్టివ్ సినిమాలు చేస్తున్న ఈ భామ అప్పుడప్పుడు తెరపై మెరుస్తుంది మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది తరచూ తన గ్లామరస్, ట్రెడిషన్‌లో ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది మరోవైపు సిద్దార్థ్‌తో లవ్ ఎఫైర్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది తాజాగా అదితి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది ఎప్పుడు గ్లామరస్ ఫొటోలు షేర్ చేసే అదితి కొత్తగా బొట్టు గురించి చెప్పుకొచ్చింది తానెప్పుడు బొట్టు పెట్టుకోవాలని అనుకోలేదంటూ తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది మీ కోసం నాకు ఇష్టమైన నల్ల బొట్టు పెట్టుకున్నాను ట్రెడిషనల్ లుక్‌లో కనువిందు చేసింది ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది