ఆరెంజ్ అనేది సీజనల్ ఫ్రూట్. ఇవి వింటర్లో విరివిగా దొరుకుతుంటాయి. పూర్తిగా సిట్రస్తో నిండిన ఈ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. అందుకే వీటిని రెగ్యూలర్గా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరెంజ్లలో విటమిన్ సి, కెరోటోనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు మెరుగైన ప్రయోజనాలు అందిస్తాయి. మీరు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఆరెంజ్లు మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి.. మెరుగైన జీవక్రియను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తాయి. (Images Source : Unsplash)