ఆ ప్రశ్న అడిగితే.. పారిపోతున్న స్వాతి - ఆన్సర్ మీకు తెలుసా? కలర్స్’ అనే బుల్లితెర ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయ్యింది స్వాతి. 'అష్టా చమ్మా’ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'స్వామిరారా’, ‘కార్తికేయ’ తదితర సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ దక్కించుకుంది. కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. ఇటీవల వచ్చిన 'మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘మంత్ ఆఫ్ మధు’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడని అడిగితే.. స్వాతి ఇదిగో ఇలా తప్పించుకుని తిరుగుతోంది. Swathi/Instagram