కూతురితో ఆటో జర్నీ - రేణు దేశాయ్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా! ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'జానీ' సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ తో జతకట్టింది. 'బద్రి' షూటింగ్ టైం లోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. పెళ్ళికి ముందే అకిరా జన్మించగా ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పవన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కూతురితో రేణు దేశాయ్ ఆటో జర్నీ చేసిన వీడియో నెటిజన్స్‌ను ఫిదా చేస్తోంది. renu desai/Instagram