నేషనల్ క్రష్ రష్మిక ఫారిన్ వెళ్ళారు. మంగళవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్టులో ఆమె కనిపించారు. రష్మిక ఎక్కడికి వెళ్లారు? ఎవరితో వెళ్లారు? అంటే... రష్మిక మిలాన్ వెళ్ళినట్లు సమాచారం అందుతోంది. మిలాన్ సిటీకి ఫ్యాషన్ క్యాపిటల్ అని పేరు ఉంది. ఈ ఏడాది మిలాన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి రష్మిక వెళ్ళారట. షూటింగులు లేకపోతే మేకప్ లేకుండా రష్మిక కనిపిస్తారు. ముంబై ఎయిర్ పోర్టులో కూడా నేచురల్ గా ఉన్నారు. కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ లో నార్మల్ అమ్మాయిలా రష్మిక మిలాన్ వెళ్లారు. రష్మికతో పాటు ఎవరూ లేరు. అసిస్టెంట్ ను కూడా తీసుకు వెళ్ళలేదు. సోలోగా ట్రావెలింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అల్లు అర్జున్ 'పుష్ప 2', రణ్ బీర్ కపూర్ 'యానిమల్'లో సినిమాల్లో రష్మిక నటిస్తున్నారు. (Image Courtesy : Manav Manglani)