ముంబై ఎయిర్ పోర్టులో మేకప్ లేకుండా కీర్తీ సురేష్ వరుస హిట్లతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ జోష్ లో ఉంది. ఆమె తాజాగా నటించిన తమిళ సినిమా 'మామన్నన్' సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో ‘దసరా‘ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్ సూపర్ హిట్ మూవీ ‘తేరి’ రీమేక్ తో హిందీలోకి అడుగు పెట్టబోతోంది. తన తొలి హిందీ మూవీలో వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. 'సైరెన్', 'రఘు తాత', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' లాంటి తమిళ ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తోంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో మేకప్ లేకుండా కనిపించింది.