మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది దివి. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. సినిమాల కంటే బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. అందంతో పాటు పర్ఫామెన్స్‌తోనూ ఆకట్టుకున్నా బిగ్ బాస్ టైటిల్ గెలవలేకపోయింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన దివి కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన వీడియో వావ్ అనిపించేలా ఉంది. Photos & Video Credit: Divi Vadthya/Instagram/twitter