గ్లామర్ ఫోటోలతో ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే కథానాయిక శ్రద్ధా దాస్. ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ ఇది. హిందీ వెబ్ సిరీస్ 'ఖాకి : ద బీహార్' చాఫ్టర్' వెబ్ సిరీస్ కోసం శ్రద్దా దాస్ ఈ విధంగా రెడీ అయ్యారు. 'ఖాకి : ది బీహార్ చాఫ్టర్'లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో శ్రద్ధా దాస్ నటించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'ఖాకి : ది బీహార్ చాఫ్టర్'లో శారీలో శ్రద్దా దాస్ కనిపించారు. ప్రమోషన్స్ కోసం ఇలా రెడీ అయ్యారు. శ్రద్ధా దాస్ అంటే మినిమమ్ ఈ మాత్రం గ్లామర్ ఉంటుంది మరి అని నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలుగులోనూ శ్రద్ధా దాస్ సినిమాలు చేస్తున్నారు. అయితే, ఆవిడకు పెద్దగా బ్రేక్ రావడం లేదు. డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో శ్రద్ధా దాస్ టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆమె గ్లామర్ హైలైట్ అవుతోంది. 'ఖాకి : ది బీహార్ చాఫ్టర్' ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. శ్రద్ధా దాస్ (All Images Courtesy : shraddha das Instagram)