సమంత ప్రధాన పాత్రలో, సరోగసీ నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'యశోద'. ఎలా ఉందంటే?

యశోద (సమంత)కు చెల్లెలి ఆపరేషన్‌కు డబ్బు అవసరం అవుతోంది. సరోగసీకి గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి ఓకే అంటుంది. 

సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్ళిన యశోదకు అక్కడ జరిగిన కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా అనిపిస్తాయి.

సరోగసీ వ్యాపారానికి, హైదరాబాద్‌లో హాలీవుడ్ నటి మరణానికి సంబంధం ఏమిటి? యశోద ఏం చేసింది? అనేది సినిమా.

ఎలా ఉంది? : 'యశోద'లో దర్శకులు హరి, హరీష్ కొత్త విషయం చెప్పారు. అది షాక్ & సర్‌ప్రైజ్ ఇస్తుంది.

హరి, హరీష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నా... అసలు కథలోకి వెళ్ళడానికి కొంత టైమ్ తీసుకున్నారు.

ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్, లాజిక్స్ పక్కన పెడితే... ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పెరిగి పరుగులు పెడుతుంది.

ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ, సంపత్ రాజ్, దివ్య శ్రీపాద తదితరులు చక్కగా నటించారు.

సినిమాను సమంత తన భుజాల మీద మోశారు. ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, ప్రతి దాంట్లో పెర్ఫెక్షన్ చూపించారు. 

ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. మణిశర్మ నేపథ్య సంగీతం, ఎం సుకుమార్ కెమెరా వర్క్ సూపర్.  

'యశోద' ఎమోషనల్ థ్రిల్లర్. సమంత షీరోయిజం, కొత్త కాన్సెప్ట్ బావుంటాయి. ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్ ఇది.