అందాల తార ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు వెండి తెరపై కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం కర్రసాాము నేర్చుకుంటోంది. కర్రసాము నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photos & Video Credit: Actress Indrajaa_absar/Instagram