నటుడు అభిజీత్.. ఖాళీ టైం దొరికితే చాలు కొండలు, కోనల వెంట తిరుగుతుంటాడు. తాజాగా అడవుల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ టైంపాస్ చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. భారత్- ఇంగ్లాండ్ మధ్య టీ-20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ చూస్తున్నట్లు చెప్పాడు. మ్యాచ్ చూసేందుకు చేసుకున్న ఏర్పాట్ల వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. నేను మ్యాచ్ చూస్తున్నాను.. మీరు చూస్తున్నారా? అంటూ నెటిజన్లు క్వశ్చన్ చేశాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అభిజీత్. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. అవకాశాలు మాత్రం రాలేదు. అడవిలో ఒంటరిగా క్రికెట్ చూస్తూ టైంపాస్ చేస్తున్న అభిజీత్ వీడియో! Photos & Video Credit: Ahijeet/Instagram