యువ కథానాయకుడు నాగశౌర్య త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు.

కర్ణాటకకు చెందిన అనూష శెట్టిని ఆయన వివాహం చేసుకోనున్నారు.

అనూష శెట్టికి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లికి ఓ సంబంధం ఉంది.

నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టి, ఎన్టీఆర్ తల్లి షాలినిది ఒకే ఊరు.

అనూష శెట్టి, షాలినిది ఒకే ఊరి సంబంధం అన్నమాట!

నాగశౌర్య, ఎన్టీఆర్ సతీమణి ప్రణతి అన్నా చెల్లెల్ల మాదిరిగా కలిసి ఉంటారు.

అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్. బెంగళూరులో తనతో నాగశౌర్యకు పరిచయం ఏర్పడింది.

వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నవంబర్ 20న బెంగళూరులో వివాహం.

శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు.

Photos Credit: Instagram/twitter