సమంత.. సినిమాలతోనే కాదు, వ్యక్తిగత జీవితం కూడా నిత్యం వార్తల్లో ఉంటోంది. తనకు ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. తాజాగా తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. వ్యాధి నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆమె నటించి ‘యశోద‘ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఓ వైపు ‘యశోద‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు జిమ్ లో కసరత్తులు చేస్తోంది. ఇష్టమైన జిలేబీని తినేందుకు కావాల్సినంత వర్కౌట్ చేస్తున్నట్లు తెలిపింది. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. Photos Credit: Samantha/Instagram/twitter