హీరో శ్రీకాంత్ ఆయన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్థిక సమస్యలతో విడాకులు తీసుకుంటున్నారంటూ కొన్ని వెబ్ సైట్స్, యుట్యూబ్ ఛానెల్స్ న్యూస్ రాశాయి. తన ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలను శ్రీకాంత్ ఖండించారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి పనికిమాలిన వార్తలను అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, ఆందోళన పడవద్దని ఊహను ఓదార్చానని చెప్పారు. విడాకులపై వస్తోన్న వార్తలను శ్రీకాంత్ ఖండించడంతో అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి. ఊహతో కలిసి అరుణాచలం దేవాలయానికి వెళ్లిన వీడియోతో ఫేక్ వార్తలు రాసిన వారికి శ్రీకాంత్ సమాధానం చెప్పారు. Photos & Video Credit: Srikanth Meka/Instagram