'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా... అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు? బహుశా... గుణపాఠాలు చెబుతానని ఏమో' - చిరంజీవి

'ఊళ్లోకి వచ్చి ఒక ఇద్దరు ముక్కు ముఖం తెలియని నా కొడుకులను కొట్టి, ఏదో చేసేశానని అనుకుంటున్నావా?' -  సోనూ సూద్ 

'నేను వచ్చానని చెప్పాలనుకున్నా. కానీ, చేయడం మొదలు పెడితే...' - చిరంజీవి డైలాగ్ కంప్లీట్ చేయకపోయినా ట్రైలర్‌లో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాయి.

'పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే... ఇంకా ఏం చూడాలని అనుకుంటుందోనయ్యా మహాతల్లి' - క్యారెక్టర్ ఆర్టిస్ట్

'పాదఘట్టం వాళ్ళ గుండెల మీద కాలు వేస్తే... ఆ కాలు తీసేయాలట. కాకపోతే అది కాలా? అని!' -  చిరంజీవి

'దివ్య వనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు... నడుమ పాదఘట్టం' - రామ్ చరణ్ 

'ఇక్కడ అందరూ సౌమ్యులు. పూజలు పునస్కారాలు చేసుకుంటూ... కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కు మని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు' - రామ్ చరణ్

'ధర్మస్థలికి ఆపద వస్తే అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది - రామ్ చరణ్

'ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతది?' - రౌడీలను చితకొట్టిన తర్వాత రామ్ చరణ్

'ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే? ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు' - 'ఆచార్య' టీజ‌ర్‌లో రామ్ చరణ్