వ్యవసాయంలో తెలంగాణ సాధించిన ప్రగతి చెబుతూనే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వ్యవసాయ తీర్మానం

తెలంగాణ మోడల్‌తో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పే రాజకీయ తీర్మానం

ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేస్తున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ, ధరల నియంత్రణకు డిమాండ్‌ చేస్తూ తీర్మానం

చట్టసభల్లో మహిళలకు 33 శాంతి రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

తెలంగాణరాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయిస్తూ తీర్మానం

బీసీల కోసం కేంద్ర బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌రూపేణా వసూలు చేయడం మానుకోవాలని తీర్మానం

నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నిర్ణయించాలని.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు రిఫర్‌ చేయాలని తీర్మానం

రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం

తెలంగాణలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జి.ఎస్.టి. రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం