మస్క్ లవ్ లైఫ్‌ అంతా గందరగోళమే

ట్విట్టర్ కొనేయడంతో ఇప్పుడు ఎలన్ మస్క్ గురించే అంతటా చర్చ.

అతని ఆస్తి, వ్యాపార సామ్రాజ్యం గురించి చాలా మందికి తెలుసు.

ఎలన్ మస్క్ లవ్ లైఫ్‌లో ఉన్న కన్ఫ్యూజన్ గురించి ఎంతమందికి తెలుసు?

మస్క్ 2000లో జస్టిన్ విల్సన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓసారి కవలలు, మరోసారి ట్రిప్లెట్స్ (ముగ్గురు పిల్లలు) పుట్టారు. ఈ జంట 2008లో విడిపోయారు.

2010లో మస్క్, తలుహా రిలే అనే నటిని పెళ్లాడారు. వారిద్దరూ అదే ఏడాది విడిపోయారు. మళ్లీ 2013లో కలిశారు. 2016లో మళ్లీ విడిపోయారు.

2016లో రెండో భార్యతో విడిపోయాక అంబర్ హెర్డ్ అనే అమెరికన్ నటితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి.

2018లో కెనడా మ్యూజిషియన్ క్లైరీ ఎలిసేతో సహజీవనం ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టులో విడిపోయారు.

రెండు నెలల తరువాత తిరిగి వారిద్దరూ కలిసిపోయారు. 2020లో వీరిద్దరికీ బాబు పుట్టాడు.

2021 డిసెంబరులో తాను క్లైరీ విడివిడిగా ఉంటున్నట్టు మీడియాతో చెప్పాడు మస్క్.

2022లో మస్క్ ఆస్ట్రేలియన్ నటి నటాషా బాసెట్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ అదే సంవత్సరం క్లైరీకి మస్క్ వల్ల మరో బాబు పుట్టాడు.

మస్క్-క్లైరీల లవ్ స్టోరీకి ఈ ఏడాది మళ్లీ ఎండ్ కార్డు పడింది. మస్క్ జీవితంలో ప్రేమకథలు,ట్విస్టులు ఎక్కువే.