'ఆచార్య'కు ఎవరు ఎంత తీసుకున్నారు? ఎవరి పారితోషికం ఎంత? అనే వివరాల్లోకి వెళితే... 

చిరంజీవి, రామ్ చరణ్ ఈ సినిమాకు డబ్బులు తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది.

'ఖైదీ నంబర్ 150'తో రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఆ సినిమాతో పాటు మిగతా సినిమాల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. సినిమాకు ఇంత అని తీసుకోవడం లేదు. 

'ఆర్ఆర్ఆర్'కు రామ్ చరణ్ రూ. 50 కోట్ల వరకూ తీసుకున్నట్టు టాక్. అయితే, ఈ 'ఆచార్య'కు ఆయన 40 రోజులు షూటింగ్ చేశారు. అయితే, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. 

'ఆచార్య'లో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఎడిట్ చేశారు. సినిమాలో ఆమె లేరు. అయినా సరే ఆమెకు కోటిన్నర ఇచ్చారట. 

'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ కోసం కొట్టిన్నర తీసుకున్న పూజా హెగ్డే, 'ఆచార్య'కు కోటి రూపాయలు తీసుకున్నారట. ఆమెది 15 నిమిషాల పాత్రే.  

దర్శకుడు కొరటాల శివ ఒక్కో సినిమాకు రూ. 15 - 20 కోట్లు తీసుకుంటున్నారట. కరోనా నేపథ్యంలో ఈ సినిమాకు 25 శాతం తగ్గించారట. మిగతా డబ్బులు కూడా పూర్తిగా తీసుకోలేదట. 

'సానా కష్టం' పాటలో డ్యాన్స్ చేసిన రెజీనాకు రూ. 25 - 35 లక్షల మధ్య ఇచ్చారట.

'లాహే లాహే...' పాటలో సంగీత కనిపించారు. సినిమాలో ఆమెకు చిన్న పాత్ర కూడా ఉందట. సంగీత రెమ్యూనరేషన్ రూ. 25 లక్షలకు అటు ఇటుగా ఉందట. 

'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత సంగీత దర్శకుడు మణిశర్మ అంగీకరించిన సినిమా 'ఆచార్య'. చిరంజీవి సినిమా కాబట్టి ఆయన తక్కువకు చేశారట. రూ. 75 లక్షలు తీసుకున్నారట. 

సోనూ సూద్ 'ఆచార్య'కు రోజుల లెక్కన పారితోషికం తీసుకున్నారని, ఒక్క రోజుకు రూ. 2.5 లక్షల వరకూ ఛార్జ్ చేశారని టాక్. 

సినిమా బడ్జెట్ ఎంత అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఇటీవల విలేఖరుల సమావేశంలో ఎంత అయ్యిందనేది లెక్క వేసుకోలేదని దర్శకుడు కొరటాల శివ వ్యాఖ్యానించారు. 

ఫిల్మ్ నగర్‌లో ప్రచారంలో ఉన్న పారితోషికం వివరాలు ఇచ్చాం!

'ఆచార్య' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.