సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఇన్ని లాభాలు మండే ఎండలకు చర్మం అనేక సమస్యల బారిన పడుతుంది. అందుకే చర్మ సంరక్షణకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. ఈ లోషన్ రాసుకోవడం వల్ల అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షణ దొరుకుతుంది. కేవలం ఎండ నుంచి రక్షణ ఇవ్వడమే కాదు, వృద్ధాప్యఛాయలను కూడా ముఖంపై కనిపించకుండా చేస్తుంది. సన్ స్క్రీన్ లోహన్ ద్వారా చర్మాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న లోషన్ ను ఎంచుకుంటే చర్మం ఎండలకు మాడిపోవడం, మండడం తగ్గుతుంది. ముఖానికి టాన్ పట్టకుండా ఈ క్రీమ్ కాపాడుతుంది. మంచి లోషన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మేలో ఎండలు మరింత ముదురుతాయి. చర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.