చంటిపిల్లలపై ప్రతాపం చూపిస్తున్న కొత్త వైరస్



క్రొయేషియా, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర ఐర్లాండ్ వంటి దేశాల్లో ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్లు అధికమవుతున్నాయి.



వీటి పెరుగుదల చూస్తుంటే ఇతర దేశాలకు త్వరగా పాకే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.



బ్రిటన్లో ఇప్పటికే 17 మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు.



ఫ్రాన్స్‌లో కూడా తొమ్మిది మంది ఈ ఎంట్రో వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడగా అందులో ఏడుగురు మరణించారు.



అప్పుడే పుట్టిన శిశువులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ వైరస్ వారిపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తోంది.



భారతదేశంలో కూడా కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అసోం, అండమాన్ దీవులలో ఎంట్రో వైరస్ వ్యాప్తి ఉండవచ్చని తెలుస్తోంది.



ఇది అంటువ్యాధి, కాబట్టి త్వరగా ఇతర శిశువులకు సోకే అవకాశం ఉంది.



నవజాత శిశువుల్లో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారుతుంది. వారి వ్యాధినిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది.