పచ్చిమిరపకాయలకు బదులు వీటిని వాడండి



పచ్చిమిరప కాయలుధర ఒకేసారి అమాంతం ధర పెరిగిపోయింది.



వీటిని ధనవంతులు ఎలాగూ ఎంతైనా ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వారికే కష్టాలు.



పచ్చి మిరపకాయల ధర తగ్గేవరకు వాటి అవసరం లేకుండా ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో కూరలకు మంచి రుచిని తెచ్చుకోవచ్చు.



నల్ల మిరియాలను పచ్చిమిరపకాయలకు బదులు ఉపయోగించుకోవచ్చు. వీటిని పొడిలా చేసుకుని కూరల్లో చల్లుకోవాలి.



ప్రతి ఇంట్లో కారంపొడి ఉంటుంది. పచ్చిమిర్చికి బదులు కారప్పొడిని వాడుకోవచ్చు.



కారంలో, కాస్త నల్లమిరియాల పొడి వేసి ఆ మిశ్రమాన్ని కూడా కూరల్లో వాడుకోవచ్చు.



ఎండుమిర్చిని మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి. వాటిని కూరల్లో వేసుకోవడం వల్ల మంచి రంగుతోపాటు రుచి కూడా వస్తుంది.



పచ్చిమిర్చి ధర తగ్గే వరకు కూరకారాన్ని తయారుచేసి పెట్టుకుంటే మంచిది. కూరకారం తయారీలో ఎలాంటి పచ్చిమిర్చి అవసరం ఉండదు.