సాగరకన్య ఉద్యోగం చేస్తున్న అందాల యువతి



ప్రపంచంలోనే అరుదైన ఉద్యోగం చేస్తోంది ఓ యువతి. సాగరకన్యలా మారి జీవితాన్ని పోషించుకుంటోంది.



బ్రిటన్‌కు చెందిన మహిళ మాస్ గ్రీన్. ఈమె బతుకుదెరువు కోసం 2016లో ఇటలీకి వెళ్ళింది.



సిసిలీ నగరానికి దగ్గర్లో ఉన్న ఒక ఐలాండ్లో ఇప్పుడు ఆమె సాగర కన్యగా ఉద్యోగం చేస్తోంది.



బీచ్‌‌కు వచ్చిన పర్యాటకుల మధ్య ఈమె సాగరకన్యలా డైవింగ్ చేయాలి.



అలాగే జలచరాలు నీటిలో ఎలా కదులుతాయో కూడా పర్యాటకులకు వివరించాలి. ఈదడం నేర్పించాలి.



రోజులో సుమారు 12 గంటలు ఈ పని చేయాల్సి వస్తుంది. ఈ ఉద్యోగం కోసం ఆమె ఎన్నో మెళకువలు నేర్చుకుంది.



ఈ సాగర కన్యను చూసేందుకే ఇప్పుడు ఎంతోమంది వస్తున్నారు.



ఈ ఉద్యోగం తనకు ఎంతో నచ్చిందని చెబుతోంది జలకన్య.