కొన్ని సందర్భాల్లో మనకి నచ్చని విషయాలకు కూడా నో చెప్పలేము. ఎదుటివారు ఏమనుకుంటారో.. ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎక్కువ ఆలోచిస్తాము. అయితే కొన్ని టిప్స్ మీరు ఫాలో అయితే ఈజీగా నో చెప్పేయవచ్చు. మీకు నచ్చని ప్రపోజల్ చేస్తే.. డైరక్ట్‌గా నో చెప్పేయండి. ఇది చాలా ఈజీ. మీరు చెప్పిన విషయం నాకు నచ్చింది కానీ ఇది నేను చేయలేనని సున్నింతగా తిరస్కరించండి. నాకు కుదరదండి ఆ టైమ్‌కి నాకు వేరే పని ఉంది. మీతో రాలేను అని చెప్పవచ్చు. మీకంటూ కొన్ని బౌండరీలు ఉన్నాయని చెప్పండి. వారే అర్థం చేసుకుంటారు. మీకు ఇష్టం లేదనే విధంగా లేట్‌గా రెస్పాండ్ అవ్వొచ్చు. (Image Source : Pinterest)