గుజరాత్‌లోని ఓ సంపన్న వజ్రాల వ్యాపారి తొమ్మిదేళ్ల కుమార్తె జైన్ సన్యాసినిగా బుధవారం దీక్ష తీసుకుంది. ధనేష్, అమీ సంఘ్వీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో దేవాన్షి పెద్ద కుమార్తె. సూరత్ వేసు ప్రాంతంలో జైన ముని ఆచార్య విజయ్ కీర్తియాష్సూరి సమక్షంలో దీక్ష తీసుకున్నారు. దేవాన్షి తండ్రికి సూరత్‌లో సంఘ్వీ అండ్ సన్స్ అనే వజ్రాల వ్యాపార సంస్థ ఉంది. ఈ మైనర్ తీసుకున్న'దీక్ష' ఆమె సన్యాస జీవితంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక వ్యక్తులతో కలిసి సుమారు 700 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారని కుటుంబ సన్నిహితులు తెలిపారు. గత శనివారం ఈ వేడుక ప్రారంభమైంది. 'దేవాన్షికి ఐదు భాషలు తెలుసు.